మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Triveni Stotram – త్రివేణీ స్తోత్రం
ముక్తామయాలంకృతముద్రవేణీ
భక్తాభయత్రాణసుబద్ధవేణీ |
మత్తాలిగుంజన్మకరందవేణీ
శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ || 1 ||
లోకత్రయైశ్వర్యనిదానవేణీ
తాపత్రయోచ్చాటనబద్ధవేణీ |
ధర్మార్థకామాకలనైకవేణీ
శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ || 2 ||
ముక్తాంగనామోహనసిద్ధవేణీ
భక్తాంతరానందసుబోధవేణీ |
వృత్త్యంతరోద్వేగవివేకవేణీ
శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ || 3 ||
దుగ్ధోదధిస్ఫూర్జసుభద్రవేణీ
నీలాభ్రశోభాలలితా చ వేణీ |
స్వర్ణప్రభాభాసురమధ్యవేణీ
శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ || 4 ||
విశ్వేశ్వరోత్తుంగకపర్దివేణీ
విరించివిష్ణుప్రణతైకవేణీ |
త్రయీపురాణా సురసార్ధవేణీ
శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ || 5 ||
మాంగళ్యసంపత్తిసమృద్ధవేణీ
మాత్రాంతరన్యస్తనిదానవేణీ |
పరంపరాపాతకహారివేణీ
శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ || 6 ||
నిమజ్జదున్మజ్జమనుష్యవేణీ
త్రయోదయోభాగ్యవివేకవేణీ |
విముక్తజన్మావిభవైకవేణీ
శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ || 7 ||
సౌందర్యవేణీ సురసార్ధవేణీ
మాధుర్యవేణీ మహనీయవేణీ |
రత్నైకవేణీ రమణీయవేణీ
శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ || 8 ||
సారస్వతాకారవిఘాతవేణీ
కాలిందకన్యామయలక్ష్యవేణీ |
భాగీరథీరూపమహేశవేణీ
శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ || 9 ||
శ్రీమద్భవానీభవనైకవేణీ
లక్ష్మీసరస్వత్యభిమానవేణీ |
మాతా త్రివేణీ త్రయీరత్నవేణీ
శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ || 10 ||
త్రివేణీదశకం స్తోత్రం ప్రాతర్నిత్యం పఠేన్నరః |
తస్య వేణీ ప్రసన్నా స్యాద్విష్ణులోకం స గచ్ఛతి || 11 ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం త్రివేణీస్తోత్రమ్ ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.